పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆడి పాడి సందడి చేసిన పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జయభేరి, మే 26:

ఆనాడు చేసిన అల్లర్లు, ఆట పాటలు ఇలా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటు పూర్వ విద్యార్థులు సందడి చేశారు. దీనికి మేడ్చల్ జిల్లా శామీర్ పేట లోని ఉన్నత పాఠశాల వేదికైంది.

Read More మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పరామర్శించిన చల్లా ధర్మా రెడ్డి 

2004-05 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. తూముకుంట పరిధిలోని సమ్మర్ గ్రీన్ రిసార్ట్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోగా పూర్వ విద్యార్థులు అంతా ఒకచోట చేరి ఆడి పాడి సందడి చేశారు. ఆనాడు చేసిన అల్లరి చేష్టలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. ఇన్ని సంవత్సరాల అనంతరం మళ్ళీ అంతా ఒకచోట కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.

Read More బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్.