దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 114వ జయంతి వేడుకలు

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 114వ జయంతి వేడుకలు

దేవరకొండ..... దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు  మదర్ థెరిస్సా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు అధ్యక్షులు NVT, జయలక్ష్మి, డాన్స్ మాస్టర్ జగన్ మదర్ థెరీసా పటానికి పూలమాలవేసి నివాళులర్పించినారు.

అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ... ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని, ఎవరైనా ఇతరులని పలకరించేటప్పుడు చిరునవ్వుతో పలకరించాలని, ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కలకత్తాలోని మురికివాడలోని అభాగ్యుల జీవితాలలో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిస్సా అని, తోటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కష్టాలలో ఉన్నవారు ఎవరు అని తెలుసుకొని వారికి సహాయం చేసి అమ్మగా మారింది.

Read More telangana politics I రాజకీయ ప్రకటనల మాయాజాలం ఓటర్ల అయోమయం

మంచితనం మానవత్వం దయాగుణం సహాయతత్వం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని 
ఈ సందర్భంగా వారు అంటూ భారతీయుల చేత అమ్మా అని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి మదర్ థెరిస్సా గారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, వైజాగ్ కాలనీ బంగారి, రాము, శ్రీధర్, మోహన్, రాధా, లక్ష్మి ,ప్రతిభ, కళాకారులు క్రీడాకారులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Read More BJP_Bandi Vs Ponnam I విజయ సంకల్ప యాత్ర ..? అసలు ఉద్దేశం ఏంటి!?

Views: 0