వయనాడ్ విలయం

ప్రకృతి సౌందర్యానికి నిలయం దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కొబ్బరి చెట్లు.. నదులు.. కొండలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. దక్షిణ భారత దేశంలో ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే రాష్ట్రం కేరళనే. అయితే ఈ కేరళపై కొన్నేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది.

వయనాడ్ విలయం

గాడ్స్‌ ఓన్‌ కంట్రీ అని చెప్పుకునే కేరళ విలపిస్తోంది. ఈ రాష్ట్రంపై ప్రకృతి మళ్లీ పగబట్టింది. భారీ వర్షాలకు జరిగిన విపత్తు, కేరళను ఘోరంగా దెబ్బతీసింది. భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడిన దారుణఘటనలో మృతులసంఖ్య పెరుగుతోంది.

ప్రకృతి సౌందర్యానికి నిలయం దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కొబ్బరి చెట్లు.. నదులు.. కొండలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. దక్షిణ భారత దేశంలో ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే రాష్ట్రం కేరళనే. అయితే ఈ కేరళపై కొన్నేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. కరోనా సమయంలో దేశంలోనే తొలి కేసు కేరళలోనే నమోదైంది. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ నుంచి లక్షల మంది వివిద దేశాల్లో స్థిరపడ్డారు. ఇక వైద్య రంగంలో ఎక్కువ మంది ఉన్న రాష్ట్రం కూడా కేరళనే. అయినా ఇక్కడ వైరస్‌లు, వ్యాధులు విజృంభిస్తున్నాయి. కరోనా, బర్డ్‌ఫ్లూ, నిఫా ఇలా వరుస వైరస్‌లు కేరళవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక వైరస్‌లతోపాటు.. తాజాగా భారీ వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తుతున్నాయి. వరదలకు వందల మంది మృత్యువాత పడుతున్నారు.

Read More ఉద్యోగ స్కీములు మోసం-కార్పొరేట్లకే లాభం

01-1007_V_jpg--442x260-4g

Read More యోగికి చెక్ పెడతారా...

నాలుగేళ్ల క్రితం వచ్చిన వరదలు కేరళలో విళయం సృష్టించాయి. తాజాగా కేరళలో వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల గ్రామాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో వందల మంది వాటికింద చిక్కుకుపోయారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటనల జరిగింది. దీంతో చాలా మంది నిత్రలోనే కొండచరియల కింద కూరుకుపోయారు. టీ ఎస్టేట్‌ కార్మికులు నివసించే ప్రాంతం కావడంతో చాలా మంది కూలీలు వాటికింద కూరుకుపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Read More ₹10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే

819768-wayanad-3

Read More 10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్

అధి ఇప్పటిదాకా 120 మంది చనిపోయారు. గాయపడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. చురల్‌మలా గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియల్లో 400 మంది కుటుంబాలు చిక్కుకున్నాయి. ఘటనాస్థలికి వెళ్లే రోడ్డు మార్గాలు ధ్వంసం అయ్యాయి. వరదలో మృతదేహాలు కొట్టుకువస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వయనాడ్‌ లోయ ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. పర్యటక ప్రాంతమైన మెప్పాడలో పరిస్థితి ఘోరంగా ఉంది.

Read More నేటితో ముగియనున్న ఎమ్మెల్సీకవిత జ్యుడిషియల్ కస్టడీ?

Kerala-5

Read More మొదటి స్పీచ్ లోనే అదరగొట్టిన శబరి

ఇక్కడి ముండకై ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఇదిలాఉంటే.. అర్థరాత్రి వేళ ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల ఫోన్లు విపరీతంగా మోగినట్లు గుర్తించారు. ఫోన్ సంభాషణలు.. బాధితుల ఆక్రందనలను స్థానిక మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది. తమను కాపాడాలంటూ ఫోన్ ల ద్వారా స్థానికులు వేడుకున్నారు. చురల్మల ప్రాంతంలోని ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి.. ఇల్లు మొత్తం శిథిలాల్లో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నట్లు ఉంది. ఆమె బిగ్గరగా ఏడుస్తూ కాపాడండి అంటూ వేడుకుంది. పలువురు అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో తమ బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి తమ కాపాడాలని వేడుకున్నారు.

Read More విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు

కొండచరియలు విరిగిపడిన ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వాయనాడ్ జిల్లాలోని విపత్తు ప్రదేశంలో కీలకమైన చురల్మల వద్దనున్న వంతెన కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయితే, కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోనుచూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

Read More మళ్లీ మేనల్లుడికి బాధ్యతలు...

ఈ వీడియోలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు, చెట్లు ధ్వంసమయ్యాయి.కేరళను ఆదుకోవాలని రాజ్యసభలో కేంద్రానికి కేరళ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కేరళకు తక్షణం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని ఎంపీలు కోరారు. వయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కోజికోడ్, మలప్పురం, వాయనాడ్ కాసరగోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్ పాలక్కాడ్‌లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Read More బడ్జెట్ పై సలహాలు ఇస్తారా..

కేరళలోని వాయనాడ్‌లోని మెప్పడి పంచాయతీలో కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం వాటిల్లిందని భారత సైన్యం వెల్లడించింది. వందలాది మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పౌర అధికారానికి సహాయం అందించమంటూ అభ్యర్థనను అందుకున్న సైన్యం.. ప్రతిస్పందనగా 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) రెండు బృందాలు, కన్నూర్‌లోని డిఎస్‌సి సెంటర్ నుండి రెండు కంటెంజెంట్లు సహా నాలుగు బృందాలను సమీకరించింది.

Read More ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేస్తా...

Social Links

Related Posts

Post Comment