ఎవరీ బోలే బాబా...

ఉత్తరప్రదేశ్ పోలీస్‌ విభాగంలో పనిచేసిన సూరజ్‌పాల్‌.. 2006లో వీఆర్‌ఎస్‌ తీసుకుని భోలే బాబాగా అవతారం ఎత్తాడు. తనకు ఎవరూ గురువులు లేరని, భగవంతుడే తనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెప్పుకుంటాడు భోలే బాబా. మొదట్లో తన సొంత గ్రామంలోనే ఒక గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక ఉపదేశాలు చేసిన భోలేబాబా.. ఇతర ప్రాంతాల్లో కూడా తన ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు.

ఎవరీ బోలే బాబా...

లక్నో, జూలై  3 :
ఎవరీ భోలే బాబా..? లక్షల మంది భక్తులు వెళ్లేంతగా.. ఆ సత్సంగ్‌లో ఏముంది..?యూపీలోని ఎటా జిల్లాలోని పాటియాలీ తహసీల్‌ ప్రాంతానికి చెందిన భోలే బాబా అసలు పేరు.. సూరజ్‌పాల్. కాన్షీరామ్‌నగర్‌కు చెందిన ఇతడు.. తనను తాను దేవుడికి ప్రతిరూపంగా చెప్పుకుంటాడు.

ఉత్తరప్రదేశ్ పోలీస్‌ విభాగంలో పనిచేసిన సూరజ్‌పాల్‌.. 2006లో వీఆర్‌ఎస్‌ తీసుకుని భోలే బాబాగా అవతారం ఎత్తాడు. తనకు ఎవరూ గురువులు లేరని, భగవంతుడే తనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెప్పుకుంటాడు భోలే బాబా. మొదట్లో తన సొంత గ్రామంలోనే ఒక గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక ఉపదేశాలు చేసిన భోలేబాబా.. ఇతర ప్రాంతాల్లో కూడా తన ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఇతడికి ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు.తన భక్తులకు బోధనలు ఇచ్చేందుకు ప్రతి ఏటా సత్సంగ్‌ పేరుతో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తాడు భోలే బాబా. ఈ సత్సంగ్‌లో తన భార్యతో పాటు ఆసనంలో కూర్చుని బోధనలు అందిస్తాడు భోలే బాబా.

Read More Himanta Biswa Sarma : అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్‌ని తానే కోరితెచ్చుకున్నారు...

కార్యక్రమం చివర్లో బాబా అనుచరులు భక్తులకు జలాన్ని పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర జలం తీసుకుంటే రోగాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ సంత్సంగ్‌కు లక్షల సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. కరోనా సమయంలో కూడా నిబంధనలు పాటించకుండా.. 50వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహించాడు భోలే బాబా.ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో గత రెండేళ్లుగా భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. బాబా అనుచరులు. ఈ ఏడాది రతిభాన్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రచారం కూడా నిర్వహించారు.

Read More Chetak Express And Railways I రైలులోని అధ్వాన పరిస్థితులు.. 

ఊరూరా పోస్టర్లు అంటించారు. అయితే ఇంతపెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నా కూడా.. పోలీసుల నుండి గానీ, అధికార యంత్రాంగం నుండి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు నిర్వాహకులు. అటు అధికారం యంత్రాంగం కూడా ఈ బాబా వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరించింది. స్థానిక ఆధ్యాత్మిక గురువు సంస్మరణార్థం ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే ఈ కార్యక్రమానికి.. నిర్వాహకులు భోలే బాబా సత్సంగ్‌ పేరుతో భారీగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

Read More Patanjali : సుప్రీంకోర్టులో పతంజలి రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ

50 వేలమందికి పైగా వచ్చిన భక్తులను.. రాత్రి 11 గంటల నుంచి బారికేడ్లు అడ్డుపెట్టి.. రోడ్లపై నిర్బందించారు. ఉదయం ఒక్కసారిగా వాటిని తొలగించడంతో భక్తులు దూసుకువచ్చారు. దీంతో భారీ తొక్కిసలాట జరిగింది.ఈ తొక్కిసలాటలో పదుల సంఖ్యలో మహిళలు, చిన్నారులు బలైపోయారు. గాయపడ్డవారిని ఎటా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతదేహలను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

Read More Arvind Kejriwa I ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి

అయితే మృతదేహాలను ఉంచేందుకు అక్కడ సరిపడ స్థలం లేకపోవడంతో కమ్యూనిటీ హాల్‌ నేలపైన, ఆవరణలో లైన్‌గా పరిచారు అధికారులు.. కమ్యూనిటీ హాల్‌లో తమవారి మృతదేహాలను చూసి బంధువులు, కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. వారి ఆర్తనాదాలతో ఈ ప్రాంతమంతా విషాదం అలముకుంది.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే వారు ఎందుకు పరుగులు తీశారన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.హత్రాస్‌ ఘటనపై లోక్‌సభలో ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.భక్తుల తాకిడితో స్థానికంగా ఉన్న ట్రాఫిక్‌ వ్యవస్థ కుప్పకూలింది. అటు నిర్వాహకులు కూడా లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులను కంట్రోల్‌ చేయలేక చేతులెత్తేశారు. దీంతో పెనువిషాదం చోటుచేసుకుంది.

Read More Bhagat Singh I స్వాతంత్య్రం కోసం ఉరి గడ్డను ముద్దాడిన భారత మాత విప్లవ చైతన్యానికి ప్రతీక

Views: 0

Related Posts