Software employee : సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ..

నగదు, బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు...

Software employee : సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ..

జయభేరి, బంజారా హిల్స్ :
ఇంటికి తాళం వేసి కార్యాలయానికి వెళ్తుండగా బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని హిలమ్ కాలనీలో నివాసం ఉంటున్న పామర్తి నాగేంద్ర అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ నెల 3న నాగేంద్ర రాత్రి 11 గంటలకు ఇంటికి తాళం వేసి కార్యాలయానికి వెళ్లి మరుసటి రోజు ఉదయం వచ్చాడు.

ఇంటికి వచ్చి చూడగా గదిలో రూ.73 వేల నగదు, 21 గ్రాముల బంగారు గొలుసు, 20 గ్రాముల బ్రాస్లెట్, రెండు ఉంగరాలు కనిపించాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడి ఉంటారని అనుమానించిన బాధితురాలు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు

Social Links

Related Posts

Post Comment