ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త.

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త.

విజయవాడ :
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్‌ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మదన్ మోహన్.. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన డిమాండ్ చేశారు.

శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో డీఎన్ఏ టెస్ట్ చేసి నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను విజయవాడలో కలిసి. తన పరిస్థితిని వివరించారు. తాను మీడియా ముందుకు వచ్చినప్పటినుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ క్రమంలోనే డీఎన్ఏ టెస్ట్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అని మదన్ మోహన్ మీడియాకు వివరించారు.

Read More YCP Puttaparthi : పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపికి భారీదెబ్బ

శాంతి కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో డీఎన్ఏ టెస్ట్ చేయించాలని హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను మదన్ మోహన్ కోరారు. అన్ని వివరాలు పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మదన్ మోహన్‌కు హోం మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన మీడియాతో చెప్పారు. శాంతి తన కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు చెబుతోందని మదన్ మోహన్ చెప్పారు. తాను విదేశాల్లో ఉన్నపుడు వీడియో కాల్ చేసి.. ఆ బిడ్డకు కారణం తానే అని చెప్పి మోసం చేసిందని. నయవంచనకు గురి చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఐవీఎఫ్ చేయించుకున్నానని చెప్పిందని. అందుకు సర్టిఫికేట్లు చూపించమని చెబితే సాకులు చెప్పిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన కడుపున పుట్టిన బిడ్డకు కారణం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అని శాంతి తనకు చెప్పినట్లు మదన్ మోహన్ వివరించారు.

Read More పట్టభద్రుల MLC BRS అభ్యర్థిగా రాకేష్ రెడ్డి

ఇక మీడియా ముందుకు వచ్చిన శాంతి. ఆ బిడ్డకు తండ్రి సుభాష్ పేరు చెప్పిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురిలో ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. తాను గతంలో సుభాష్‌తో ఫోన్‌లో మాట్లాడానని. అతను డీఎన్ఏ టెస్ట్‌కు సిద్ధం అని చెప్పాడని, కానీ ప్రస్తుతం అతడు అజ్ఞాతంలో ఉన్నాడని మదన్ మోహన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందేనని చెప్పారు. ఇదే అంశంపై కోర్టులో పిటిషన్ వేస్తానని. క్లినికల్‌గా సర్టిఫికెట్ తీసుకుంటే ఆ బిడ్డ సమాజంలో గౌరవంతో జీవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శాంతి పచ్చి అబద్దాలు చెబుతోందని. తనకు విడాకులు ఇవ్వలేదని వివరించారు. తనను బెదిరించి బలవంతంగా సంతకం‌ చేయించుకుందని, ఆమె చూపించేవి ఫేక్ డాక్యుమెంట్లని తేల్చి చెప్పారు.

Read More Raghu Ram-Babu : బాబుతో డీల్ ఓకే... అసెంబ్లీ బరిలోకి రఘురామ

Views: 0

Related Posts