మేలు జాతి పశువులతో  పాల దిగుబడిని పెంపొందించుకోండి 

మేలు జాతి పశువులతో  పాల దిగుబడిని పెంపొందించుకోండి 

జయభేరి, పరవాడ:
రాష్ట్ర పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశు సంవర్థక శాఖ పరవాడ సబ్ డివిజనల్ అసిస్టెంట్ డైరక్టర్ డా.రామకృష్ణ కీర్తి పేర్కొన్నారు. పాడి రైతులందరూ ఈ పశువైద్య శిబిరాలను  వినియోగించుకొని తమ పాడిని అభివృద్ధి చేసుకోవాలని తమ సందేశాన్ని అందించారు. 

కృత్రిమ గర్భదారణ ద్వారా మేలు జాతి పెయ్యలను పొంది తమ పాడిని పెంచుకోవాలని సూచించారు. మేలు జాతి పశువులను అభివృద్ధి చేసుకుని రైతులందరూ పాల దిగుబడిని పెంపొందించుకోవాలని కోరారు. లంకెలపాలెం పశువైద్య శాల పరిధిలోనిమంత్రిపాలెం జివిఎంసి 85 వార్డు, వాడ చీపురుపల్లి గ్రామాలలో నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలలో రైతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ పశువైద్య సిబ్బంది 215 పశువులకు  వైద్య సేవలు అందించారని, పశువులకు, గొర్రెలకు, మేకలకు నట్టలు నివారణ మందులు త్రాగించి, వ్యాధి నిరోధక టీకాలు,గర్భకోశ వ్యాధులకు చికిత్సలు,గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

Read More PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..!

Untitled2

Read More IAS Committee: MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పశు బీమా, పశుగ్రాస విత్తనాలు, చాఫ్ కట్టర్స్(గడ్డికోసే యంత్రాలు), మిశ్రమ దాణా పథకాలను సద్వినియోగం చేసుకుని పశు సంపదను,పాడి ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవచ్చని  వివరించారు.ఈ కార్యక్రమంలో లంకెలపాలెం పశువైద్యులు డా.అశ్విని ప్రపుల్ల,వాడ చీపురుపల్లి పశువైద్యులు డా.సురేష్ కుమార్,పశు సంవర్థక శాఖ సిబ్బంది కల్యాణి,పశు సంవర్థక సహాయకులు పద్మ, లక్ష్మణ్,బాలాజీ,భాస్కర్, నాగేశ్వర రావు మరియు మంత్రిపాలెం,85 వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మీ ప్రసాద్,వార్డు మెంబర్లు,డైరీ డైరక్టర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read More AP Election : నామినేషన్లకు సర్వం సిద్ధం.. ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్..!

Views: 0

Related Posts