రైతు, కార్మికుల సమస్యలపై దేశ వ్యాప్త ఆందోళన జయప్రదం చెయ్యండి 

పరవాడ ఫార్మాసిటీలో  సిఐటియు ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహణ

రైతు, కార్మికుల సమస్యలపై దేశ వ్యాప్త ఆందోళన జయప్రదం చెయ్యండి 

జయభేరి, పరవాడ :
రైతు, కార్మికుల సమస్యలను కేంద్రం ప్రభుత్వం పరిస్కారం చూపాలని దేశం అంతా చెప్పేట్టబోయే ఆందోళన కార్యక్రమంను జయప్రదం చెయ్యాలని పరవాడ ఫార్మాసిటీలో  సిఐటియు ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు  మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి సంకీర్ణ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు, కార్మికుల సమస్యలు పట్టడం లేదని ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు అమలు చేస్తుందని కార్పొరేట్లకు లొంగి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు. అదే దారిలో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వo రాష్ట్రంలో అదే విధానాల అమలు చేస్తున్నాయని అందుకని ఈనెల 26వ తారీఖున అనకాపల్లి నెహ్రూ చౌక్ వద్ద మహా ధర్నా జయప్రదం చేయాలంటూ పరవాడ ఫార్మసిటీలో  సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.

Read More ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..!

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ... కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించి అమలు చేయాలని, కార్మికులకు నష్టమైన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దుచేసి స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ ఆపాలని, 2021 లో రైతాంగం చేసిన  పోరాటాల ఫలితంగా మూడు రైతు నల్ల చట్టలు రద్దు అయ్యాయి. రైతులు చేసిన అప్పులు తీర్చలేక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రైతులు పండించిన పంటకు ఉత్పత్తి ఖర్చు కుటుంబ శ్రమ విలువకు మరో 50% కలిపి కనీసం మద్దతు ధర చట్టం చేయాలి.

Read More AP : రాజధానిపై జగన్ నిర్ణయం ఇదే..

WhatsApp Image 2024-11-23 at 18.31.07

Read More Viveka Murder : ఎన్నికల అజెండగా వివేకా హత్య

కౌలు రైతులకు యజమాని సంతకం లేకుండా గుర్తింపు కార్డులు రుణ సౌకర్యం అమలు చేయాలి. రైతులకు వ్యవసాయ కార్మికులకు ప్రతినెల పదివేల రూపాయలు పెన్షన్ గా ఇవ్వాలి. రైతుల పంటకు రుణమాఫీ చేయాలి కేరళ వామపక్ష ప్రభుత్వం తరహా దేశవ్యాప్తంగా రుణం విమోచన చట్టం చేయాలి. విశాఖ డైరీ  తగ్గించిన ఆవు పాలు ధర వెంటనే పెంచాలి రైతులు బోనస్ చెల్లించాలి. 2022 విద్యుత్తు సవరణ చట్టం రద్దు చేయాలి ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపు విధానాన్ని రద్దు చేయాలి. జిల్లాలో మూసేసిన షుగర్ ఫ్యాక్టరీలు వెంటనే తెరిపించాలి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలి.

Read More Pavan Babu I దారి తప్పిన పవన్ గాలులు.. చంద్రబాబుతో పొత్తులు...

ఉపాధి హామీ పథకంలో 600 కూలి, 200 వందల రోజులు పని కల్పించాలి. పెరుగుతున్న నిత్యవసర ధరలు తగ్గించాలి. విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి. ప్రజలపై విద్యుత్ వారాల మోపదు. రైతులకు పెట్టుబడి సాయం 20 వేల రూపాయలు వెంటనే చెల్లించాలి.  కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మినెంట్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు, నాయకులు గుమ్మాల శివచలం, బి నాగరాజు, పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read More Chandrababu : ఏపీలో వారందరికి చంద్రబాబు గుడ్‌న్యూస్..

Views: 0

Related Posts