జయభేరి, పరవాడ: మండల కేంద్రం అయ్యిన పరవాడ గ్రంధాలయలో గ్రంధాలయ వారోత్సవములలో భాగముగా పరవాడ శాఖా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయడమైనది.
ఈ పుస్తక ప్రదర్శన అనంతరం స్కూల్ పిల్లలకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వారు పుస్తక పఠనం వలన కలిగే లాభాల గురించి తెలియపరచారు. స్కూల్ సమయలలో కాకుండా ప్రతి ఆదివారం గ్రంథాలయమునకు వచ్చి జ్ఞాన సంపాదన,పుస్తకం పై మక్కువ పెంపొందించుకోవలసినదిగా పిల్లలకు తెలియపరిచ్చినట్టు గ్రంధాలయం రికార్డ్ అసిస్టెంట్ కె.వి లక్ష్మణరావు తెలియపరిచారు.ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు,పుస్తక ప్రియలు,గ్రంధాలయం సిబ్బంది పాల్గొన్నారు.
