మీరే దిక్కు సారు... భూ నిర్వహితులు

  • సర్వం కోల్పోయాం. సరైన పరిహారం, పాట్ల పోజిషన్ చూపి ఆదుకోండి.
  • కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలంటు భూనిర్వాహితుల విజ్ఞప్తి...
  • 8వ రోజుకు చేరిన భూ నిర్వహితుల సమ్మె.

మీరే దిక్కు సారు... భూ నిర్వహితులు

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 30 :
భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలంటూ వర్గల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఆందోళన సోమవారం కి 8వ రోజుకి చేరింది. గత ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో రైతులను నట్టేట ముంచిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకొని పరిహారాన్ని రెట్టింపు చేసి ఇవ్వాలని భూ నిర్వహితులు కోరారు. అలాగే రైతుల సమస్యల పై రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వేలు నిర్వహించి అర్హులకు ప్యాకేజీలు అన్ని ఇవ్వాలని కోరారు. 

నిరసన శిబిరాన్ని సందర్శించిన ఎమ్మార్వో బాలరాజ్
భూ నిర్వాహకులు చేస్తున్న సమ్మెపై స్పందించిన తహసిల్దార్ బాలరాజు తన సిబ్బందితో ఆందోళన శిబిరం వద్దకు చేరుకొని సమస్యల నివేదికను తీసుకున్నారు. ఈ నివేదికలను పై అధికారులకు అందించి సమస్యలను పరిష్కరిచే విధంగా కృషి చేస్తామన్నారు.

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

ఈ సందర్భంగా భూనిర్వహితులు   సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే ప్రాణ త్యాగాలు కూడా సిద్ధపడతామని రైతులు తెలిపారు. రైతుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వాన్ని కోరారు.

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

25146095-f6d5-446c-bee9-a3bcbb78d6b9

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

Views: 0