నకిలీ మందులు విత్తనాలు విక్రయిస్తే ఊరుకునేది లేదు

ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి రాధిక

నకిలీ మందులు విత్తనాలు విక్రయిస్తే ఊరుకునేది లేదు

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 24 :
నకిలీ పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం వర్గల్ మండల కేంద్రంలోని వివిధ ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాములను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల యజమానులు వ్యవహరించవద్దని, రికార్డులు సరిగా మైంటైన్ చేయడంతో పాటు నిర్ణయించిన ధరలకే రైతులకు విక్రయించి బిల్లులు తప్పకుండా ఇవ్వాలని సూచించారు.

ముఖ్యంగా లైసెన్సు లేని కంపెనీల ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులకు అంటగట్ట వద్దని హెచ్చరించారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని, రైతులు సైతం తప్పకుండా రశీదు తీసుకోవాలని సూచించారు. కాలం చెల్లిన పురుగు మందులను రైతులకు విక్రయించవద్దని,  అందుకు భిన్నంగా వ్యవహరిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. రైతులు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని వివరించారు.

Read More కేసీఆర్ గారు మిరెక్కడా...?