Congress : అధికారం చేజారిన హరీష్ రావు కు అహంకారం తగ్గలేదు
మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మైనంపల్లి... ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదు... అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన కుంభకోణాలు బయటపెట్టి తీరుతాం
- అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలన్నీ బయటపెడతామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు , దళిత బంధు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు.
జయభేరి, ఏప్రిల్ 21 :
మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో సోమవారం నిర్వహించే సీఎం సభ స్థలిని మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సభకు ఏడు నియోజకవర్గాల నుండి లక్ష మంది ప్రజలు కార్యకర్తలు విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. ఎంపి అభ్యర్థి సునీతమహేందర్ రెడ్డి కలెక్టరేట్లో నామినేషన్ వేసిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి ర్యాలీగా విచ్చేసి సభలో ప్రసంగిస్తారని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు బిఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేసామని బాధపడుతున్నారని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా అధికారం ఉందని అనుకుంటు అహంకారంతో మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడితే తగ్గలేదని ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కల్వకుంట్ల కుటుంబం నిద్రపోయే పరిస్థితి ఉండదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలన్నీ బయటపెడతామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు , దళిత బంధు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని త్వరలోనే ఆ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవించే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ , సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ , తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి బాలేష్ , శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్ , మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment