సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో జారీ పడిన కూతురు..

కూతురును కాపాడడానికి దూకి తండ్రి మృతి

సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో జారీ పడిన కూతురు..

జయభేరి, కరీంనగర్ :
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్(47) నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఏండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.. 

అక్కడ కూతురూ సాయినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారీ నీటిలో పడింది. కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్, 10వ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు దూకారు.. ముగ్గురు మునిగిపోవడం చూసి తల్లి అరవడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు శంకర్ సాహసోపేతంగా నీటిలో దూకి కూతురును, కుమారుడిని కాపాడాడు. సంతోషంగా గడుపుతూ తమ కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో పిల్లలు డాడీ వస్తాడు, డాడీకి ఎం కాలేదంటూ ఎడవడంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.

Read More గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి