జయభేరి, దేవరకొండ :
దేవరకొండ మాజీ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా దేవరకొండ బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు శనివారం స్థానిక హజ్రత్ ఖాదర్ షా వలి (పెద్ద దర్గా)లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రవీంద్ర కుమార్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రార్థనలు చేశారు. భవిష్యత్ లో వారు ఉన్నత పదవులు పొంది దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలని కొనియాడారు. వారి జన్మదినం సందర్భంగా దర్గా ముతవల్లి ద్వారా ప్రత్యేక దువా చేశారు. అనంతరం అందరికి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నగర మైనార్టీ నాయకులు మహ్మద్ జానీ బాబా, మహ్మద్ ఇలియాస్ పటేల్, మహ్మద్ ఆఫ్రోజ్, మహ్మద్ నజీర్, మహ్మద్ షహ్ బాజ్, మహ్మద్ షాదాబ్, మహ్మద్ ముజమ్మిల్, దర్గా ముతవల్లి బర్కతుల్లా తదితరులు పాల్గొన్నారు.