మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

జయభేరి, గజ్వెల్, నవంబర్ 23 : 
కాంగ్రెస్ గ్యారంటీల మోసానికి మరాఠ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు,  మనోహర్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అని మరాఠీ ప్రజలు మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ ను కోరుకున్నారని హర్షం వ్యక్తం చేసారు. మహారాష్ట్ర బీజేపీ విజయం సాధించడం పట్ల శనివారం భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో గజ్వెల్ అంబేద్కర్ చౌరస్తా లో సంబురాలు నిర్వహించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ మహారాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందన్న అబద్దపు ప్రచారం చేసి కుట్ర చేసిన కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నా రు. దీన్ని ఈవీఎంల గోల్ మాల్ జరిగిందని కాంగ్రెస్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణపై కూడా ప్రభావం చూపుతాయిన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి మిఠాయి పంచుకొని, టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలొ గజ్వెల్ బీజేపీ నాయకులు సందీప్ కుమార్, చెప్పాలా వెంకటరెడ్డి, నరసింహ,దయాకర్ రెడ్డి, హరి, గుల్ల వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి