భయ్య భవాని ప్రసాద్ ను సన్మానం చేసిన ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్

భయ్య భవాని ప్రసాద్ ను సన్మానం చేసిన ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్

జయభేరి, డిoడి :
ఆల్ ఇండియా నీట్ పరీక్షల్లో 720 మార్కులకు గాను 552 మార్కులు సాధించిన భయ్య భవాని ప్రసాద్ కు శనివారం జాతీయ సేవ రత్న అవార్డు గ్రహీత ఆర్ టి ఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ శాలువా కప్పి సన్మానం చేసినారు.

తవాక్లపూర్ గ్రామానికి చెందిన భయ్య వెంకటయ్య రమాదేవి ల కుమారుడు భయ్య భవాని ప్రసాద్ చిన్న దాటి నుండే చదువులో  ప్రతిభ కనబరిచి  పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు. ముందు ముందు ఉన్నత చదువులలో మంచి నైపుణ్యం ప్రదర్శించి  తల్లిదండ్రులకు సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. మీ సన్మాన కార్యక్రమంలో వీరితోపాటు ఆర్.ఎం.పి  డా,,దేవస్వామి, యువ నాయకులు అనిల్ కుమార్ మరియు తుదితరులు పాల్గొన్నారు.

Read More నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!