Revanth : పదేండ్ల మోసం, వందేళ్ల విధ్వంసం ..
బిజెపి పాలనపై కాంగ్రెస్ ప్రజా ఛార్జీషీట్ విడుదల
- రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200లకు పెంచారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.60 ఉన్న పెట్రోల్ ఇప్పుడు రూ.110లకు పెరిగిందని, ఆ రోజు రూ.80 ఉన్న మంచినూనె ఈ రోజు రూ.180 అయిందని దుయ్యబట్టారు.
జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 25 :
పదేండ్ల మోసం, వందేళ్ల విధ్వంసం పేరుతో బిజెపి పాలనపై కాంగ్రెస్ ప్రజా ఛార్జీషీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200లకు పెంచారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.60 ఉన్న పెట్రోల్ ఇప్పుడు రూ.110లకు పెరిగిందని, ఆ రోజు రూ.80 ఉన్న మంచినూనె ఈ రోజు రూ.180 అయిందని దుయ్యబట్టారు. పదేళ్లలో మోడీ వైఫల్యం సామాన్యులు కూడా బ్రతకలేని నిత్యవసర ధరలు పెరిగాయని, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 7 లక్షల ఉద్యోగాలే ఇచ్చారని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని మోడీ మోసం చేశారని, రైతులను ఆదుకుంటామని మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులో లక్షల మంది రైతులు 16 నెలలు ధర్నాలు చేశారన్నారు. స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల నల్లదనం తెస్తానని మాట తప్పారని, రూ.15 లక్షలు ప్రతి పేదవాడి ఖాతాలో వేస్తానని దేశాన్ని మోసం చేశారన్నారు.
Post Comment