Telangana : రసాభాసగా కాంగ్రెస్ పార్టీ సమావేశం

మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది.

Telangana : రసాభాసగా కాంగ్రెస్ పార్టీ సమావేశం

జయభేరి, మేడ్చల్ :
మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. శనివారం మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ ఉమ్మడి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ జంగయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవలే మేడ్చల్ మున్సిపల్ చెందిన పదిమంది మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బిల్డింగ్ల వద్ద లక్షలో అక్రమంగా వసూలు చేసిన కౌన్సిలర్లు పార్టీ లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని కాదని కొత్తగా చేరిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లకు ప్రాధాన్యత ఎందుకిస్తున్నారనీ అన్నారు. గత 10 సంవత్సరాలు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని బీఆర్ఎస్ హయాంలో కేసులు సైతం ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మధ్యలోనే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జోక్యం చేసుకొని తర్వాత మాట్లాడమని గొడవను సద్దుమణిగించారు.

Read More దేవరకొండ పట్టణ  పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక