ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు

జయభేరి, శాయంపేట : 
మండలంలోని పత్తిపాక గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానాని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.భూపాలపల్లి ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీసులో గండ్ర సత్యనారాయణరావును పత్తిపాక పద్మశాలి కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం ఎంఎల్ఏ కు కులసంఘం భవనం గురించి వివరించగా అదనంగా మరిన్ని నిధులు కావాలని పద్మశాలి కులస్తులు కోరగా కేటాయిస్తునట్లు స్పష్టం చేసినారు.ఎంఎల్ఏ కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఎంఎల్ఏ మాట్లాడుతూ పద్మశాలి కులస్తులు ఒకచోట కూర్చొని వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ భవనం తోడ్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ కందగట్ల ప్రకాశం,చేనేత సహకార సంఘం అధ్యక్షులు గుర్రం రమేష్, కులస్తులు కందగట్ల సూర్యనారాయణ,గుర్రం కుమారస్వామి, కందగట్ల తిరుపతి, బంక ప్రవీణ్, కందగట్ల నవీన్, రాజమొగిలి, బంక భిక్షపతి, కందగట్ల శ్రీధర్, చంద్రప్రకష్, శివరాజు,వెంకటేష్, చిమ్మని శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

Views: 0