Medchal : మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి నామినేషన్ల వెల్లువ

మంగళవారం 12 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాల సమర్పణ - జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్

Medchal : మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి నామినేషన్ల వెల్లువ

జయభేరి, ఏప్రిల్ 23 :
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ లో భాగంగా  మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ స్థానానికి పలువురు అభ్యర్థులు నామినేషన్ లు వేశారు.  మంగళవారం నాడు 12మంది అభ్యర్థులు  నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. అలియన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా  మేడ్ సత్యం  రెండు సెట్లు దాఖలు చేయగా , తల్లాడ వెంకటేశ్వర్లు ఒక్క సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఇక బీఆర్ ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

అలాగే రాష్ట్రీయ మానవ పార్టీ అభ్యర్థిగా కె.వి.గీత కుమారి, విడుతలై చిరుతాయిగల్ కట్చ్ అభ్యర్థిగా మంచిని ఆంజనేయులు రెండు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శ్రమజీవి పార్టీ అభ్యర్థిగా జక్కుల నర్సింలు, రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ అభ్యర్థిగా కొండా అప్పారావు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా కె.పి.విజయ కుమార్ నామినేషన్ వేశారు. అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా చేపూరి రాజు, స్వతంత్ర అభ్యర్థులుగా గంటా చరితరావు, దొంతుల భిక్షపతి, ముస్త్యాల రామచంద్రం ఒక్క సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్  తెలిపారు.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ