Congress : శామీర్ పేట్ లో బీఆర్ఎస్ ను వీడిన నేతలు 

జంగయ్య యాదవ్, సుధీర్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరిన నేతలు..  అభివృద్ధి ని చూసి పార్టీలో చేరుతున్నారు - జంగయ్య యాదవ్

  • బీఆర్ఎస్ పార్టీకి రోజూ రోజుకు ఆదరణ తగ్గుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు స్పష్టంచేశారు.

Congress : శామీర్ పేట్ లో బీఆర్ఎస్ ను వీడిన నేతలు 

జయభేరి, ఏప్రిల్ 21 :
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బిర్ఎస్ నాయకులు వంగ నరసింహారెడ్డి తో పాటు సుమారు 500 ల మంది నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి రోజూ రోజుకు ఆదరణ తగ్గుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఎంపీటీసీ డప్పు సాయిబాబా, మహేందర్ యాదవ్, కిషోర్ యాదవ్, ముజీబ్, సీనియర్ నాయకులు కట్ట మైసమ్మ చైర్మన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

a08e2396-f057-40cc-987c-212754d41407

Read More క్షయ వ్యాధి పట్ల  అప్రమత్తంగా ఉండాలి.