పరకాల ఏజీపీగా లక్కం శంకర్
శంకర్ ను సన్మానించిన ఎమ్మెల్యే
జయభేరి, పరకాల, డిసెంబర్ 04:
పరకాల పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది లక్కం శంకర్ ను పరకాల ఏజీపీగా నియమిస్తూ హనుమకొండ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అట్టి నియామక పత్రాన్ని బుధవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు లక్కం శంకర్ కి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా అందుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
Views: 0


