BRS : మెదక్ కోసం రంగంలోకి కేసీఆర్
- ఇక రోడ్ షో ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్… మెదక్ లోక్ సభ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏదైనా లోక్ సభ స్థానంలో తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ గట్టి నమ్మే లిస్ట్ లో మెదక్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత… మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఐదు ఎన్నికల్లో కూడా గులాబీ జెండానే ఎగిరింది.
జయభేరి, మెదక్, మే 9 :
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక రోడ్ షో ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్… మెదక్ లోక్ సభ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏదైనా లోక్ సభ స్థానంలో తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ గట్టి నమ్మే లిస్ట్ లో మెదక్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత… మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఐదు ఎన్నికల్లో కూడా గులాబీ జెండానే ఎగిరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ లోక్ సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది.
మారిన పరిస్థితుల దృష్ట్యా… స్వయంగా కేసీఆరే ఈ సీటుపై ఫోకస్ పెట్టారు.కేసీఆర్ రోడ్డుషో లతో పాటు పబ్లిక్ మీటింగ్ ద్వారా తన విజయం సులువుగా మారుతుందని పార్టీ అభ్యర్థి పి వెంకట్రామి రెడ్డి భావిస్తున్నారు. మెదక్ లోక్ సభ పరిధిలోని ప్రతి మండలంలో ప్రచారం చేసిన హరీష్ రావు… కేసీఆర్ సభలను కూడా అన్ని తానై నడిపిస్తున్నారు. ఇక మెదక్ స్థానంలో ఆశించిన ఫలితం రాకపోతే… కేసీఆర్ కు గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… మరోసారి కూడా ఇక్కడ విక్టరీ కొట్టాలని గూలాబీ బాస్ భావిస్తున్నారు.
Post Comment