బీజేపీలో చేరనున్న సీఎం రేవంత్.. రేవంత్ పై దూషణలు విసిరిన కేసీఆర్

బీజేపీలో చేరనున్న సీఎం రేవంత్.. రేవంత్ పై దూషణలు విసిరిన కేసీఆర్

బీజేపీలో చేరేందుకు సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) ఆరోపించారు. బీజేపీలో ఎప్పుడు చేరతారో తెలియడం లేదని విమర్శించారు. మంగళవారం అందోలు మండలం సుల్తాన్‌పూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీలపై కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు.

జయభేరి, సంగారెడ్డి జిల్లా: 
బీజేపీలో చేరేందుకు సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోపించారు. బీజేపీలో ఎప్పుడు చేరతారో తెలియడం లేదని విమర్శించారు. మంగళవారం అందోలు మండలం సుల్తాన్‌పూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీలపై కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన మెతుకు సీమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణ హక్కులను నెరవేర్చేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు.

Read More నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా