వంతెన నిర్మాణంలో నివాస స్థలాలు కోల్పోతున్న వారికి తగిన పారితోషికం ఇప్పిచ్చేటట్లు చూడాలి

 వంతెన నిర్మాణంలో నివాస స్థలాలు కోల్పోతున్న వారికి తగిన పారితోషికం ఇప్పిచ్చేటట్లు చూడాలి

ఘట్కేసర్ మున్సిపాలిటీ లొ ప్రధాన సమస్య అయిన రైల్వే వంతెన నిర్మాణ పనుల గురించి. ఘట్కేసర్ బస్టాండ్ వరకు డిస్టిక్ బస్సులను వచ్చి పోయేటట్టు, గురుకుల్ కళాశాల, ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా మిగిలిపోయిన గదుల నిర్మాణం పనులు పూర్తి అయ్యేటట్టు వంతెన నిర్మాణంలో నివాస స్థలాలు కోల్పోతున్న వారికి తగిన పారితోషికం ఇప్పిచ్చేటట్లు చూడాలని ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ. బండారి శ్రీనివాస్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మల్లీ పెద్ది సుధీర్ రెడ్డిని ప్రతాప్ సింగారంలోని ఆయన నివాసంలో కలిసి సమస్యలను విన్నవించడం జరిగింది.

సుధీర్ రెడ్డి ఇట్టి సమస్యలను విని సానుకూలంగా స్పందించి ఇట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు  త్వరగా పూర్తి అయ్యేటట్టు  చూస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ గౌడ్, పలుగుల మాధవ రెడ్డి, సుధీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

Read More వ్యవసాయ సహకార సంఘం 43 వ సాధారణ సమావేశం

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షేక్ జహంగీర్, బండారి ఆంజనేయులు గౌడ్, బేతాళ నర్సింగ్ రావు, మాజీ ఎంపిటిసి లు మేకల నర్సింగ్ రావు, దీకొండ రఘు, సహకార బ్యాంక్ డైరెక్టర్ కందకట్ల పద్మా రెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల హరిశంకర్ ముదిరాజ్, పడిగం వెంకటేశ్వరరావు, మైనార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్, అను బాయ్, కృపా నిధి, ఎండి నజీర్, నాయకులు సారా మురళి గౌడ్, శ్రీశైలం ముదిరాజ్, బబ్బురి శ్రీనివాస్ గౌడ్, బిజిలి సదానంద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు ఎండి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Read More మీరే దిక్కు సారు... భూ నిర్వహితులు