ఇస్కాన్ టెంపుల్ పూరి జగన్నాథ (కృష్ణ) రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
పోస్టర్లు, కరపత్రంలు ఆవిష్కరించి పంచడం జరిగినది... దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామము నుండి శ్రీకృష్ణ రథయాత్రకు భక్తులను అధిక సంఖ్యలో తరలిరావాలని అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు కొనియాడారు.
జయభేరి, దేవరకొండ :
పూరి జగన్నాథ్ శ్రీకృష్ణ రథయాత్ర జూలై 10 వ తారీకు మన దేవరకొండ కు రానున్నడంతో రథయాత్రను విజయవంతం చేయడం కోసం సోమవారం స్థానిక వాసవి కళ్యాణ మండపంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పోస్టర్లు, కరపత్రంలు ఆవిష్కరించి పంచడం జరిగినది... దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామము నుండి శ్రీకృష్ణ రథయాత్రకు భక్తులను అధిక సంఖ్యలో తరలిరావాలని అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు కొనియాడారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రథయాత్ర నిర్వహణ ఏర్పాట్లు చందాల పై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీలకు రసీదు పుస్తకాలను అందించారు. అదేవిధంగా ఈ పూరి జగన్నాథ రథయాత్రలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కోలాటాలు మరియు వివిధ నృత్యాలతో కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.
Post Comment