Hyderabad : హైదరాబాద్ కు డెంజర్ బెల్స్.. ఇక కష్టాలు తప్పవా..!

అంతా కాంక్రీట్ జంగిల్‌గా మారడం.. నీరు ఇంకిపోయేందుకు నేల ఉపరితలం లేకపోవడంతో నీటి కొరత ఏర్పడిందని చెబుతున్నారు.

Hyderabad : హైదరాబాద్ కు డెంజర్ బెల్స్.. ఇక కష్టాలు తప్పవా..!

బెంగళూరు నీటి సమస్యతో అల్లాడుతోంది. బెంగళూరులో కాంక్రీట్ నిర్మాణాలు పదిరెట్లు పెరగడం వల్ల నీటి మట్టాలు 79 శాతం తగ్గాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవలి అధ్యయనం పేర్కొంది. పెరుగుతున్న పట్టణ విస్తరణ, క్షీణిస్తున్న నీటి పట్టికల మధ్య బలమైన సంబంధాన్ని అధ్యయనం హైలైట్ చేస్తుంది.

బెంగళూరు నగర విస్తరణ 1973లో 8 శాతం నుంచి 2023 నాటికి 93.3 శాతానికి 1055 శాతం పెరిగింది. కానీ నీటి వనరులు ఈ మేరకు పెరగలేదు. హైదరాబాద్‌లో నీటి కొరతపై ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఎందుకంటే.. 2010 నుంచి 2021 మధ్య వాణిజ్య, నివాస నిర్మాణ ప్రాంతాలు భారీగా పెరిగాయి. ఇంకా పెరుగుతో. అంతా కాంక్రీట్ జంగిల్‌గా మారడం.. నీరు ఇంకిపోయేందుకు నేల ఉపరితలం లేకపోవడంతో నీటి కొరత ఏర్పడిందని చెబుతున్నారు. నీటి వనరుల కాలుష్యం కూడా నీటి కొరతకు కారణమని చెబుతున్నారు.

Read More Auto I షౌకత్ గ్యారేజ్

హైదరాబాద్‌లో 185 నోటిఫైడ్ వాటర్ బాడీలు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రికార్డులు వెల్లడిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఈ నీటి వనరులు చాలా ఎక్కువగా కలుషితమయ్యాయి. అలాగే అనేక నీటి వనరులను కబ్జా చేసి ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. 20కి పైగా నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఇప్పటికే నీటి సమస్య ఉంది.

Read More GHMC I శివ శివ.. హర హర...

ఇప్పటికైనా కళ్లు తెరిచి భూమిలోకి నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలు భూగర్భ జలాలను పెంచుతాయి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత వేయాలన్నారు.

Read More Telangana I యువత ఆలోచన విధానం..!

Views: 0