PMC : పీర్జాదిగూడలో  హై"డ్రామా"

  • అవిశ్వాసానికి ఒకరోజు ముందు డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం
  • రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సమస్య లేదంటున్న సీఎం, డిప్యూటీ సీఎం. 
  • విద్యుత్ అంతరాయాలపై అధికారులను నిలదీసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు.
  • ప్రభుత్వం పరువు తీస్తున్నారంటూ నవ్వుకున్నా ఇతర శాఖల అధికారులు

PMC : పీర్జాదిగూడలో  హై

జయభేరి, మేడిపల్లి :
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ లో హైడ్రామా జరిగింది. నేడు అవిశ్వాసం ఉందని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి తీర్మానాలు చేయలేము అని  తెలిసి కూడా డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 

ఆద్యంతం మమ అన్నట్లుగా సాగిన ఈ సమావేశంలో సమస్యల సంగతి పక్కన పెడితే.. జూన్ 5 న జరిగే అవిశ్వాసంలో గెలిచే బలం లేనందున, మిగిలిన ఒక్క రోజైనా మేయర్ కుర్చీలో కూర్చోవాలనే ఆకాంక్ష కాంగ్రెస్ కార్పొరేటర్లలో స్పష్టంగా కనిపించిందని సాక్షాత్తు సమావేశంలో పాల్గొన్న అధికారులే చర్చించుకోవడం కొసమెరుపు. అలాగే రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తుంటే.. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లు విద్యుత్ అంతరాయం, అప్రకటిత విద్యుత్ కోతలపై విద్యుత్ అధికారులను నిలదీయడంతో సమావేశంలో ని అధికారులు అందరూ నవ్వుకున్నారట. 

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

కాంగ్రెస్ కార్పొరేటర్లు అయి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారట. ఇప్పటికే  మేయర్ జక్క వెంకట్ రెడ్డి కిడ్నాప్ యత్నాలు చేసి పోలీసు కేసుల పాలైన కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాకే బలం ఉంది కానీ అవిశ్వాసం మాత్రం పెట్టొద్దని కోర్టును ఆశ్రయించి అబాసుపాలైన సంగతి విదితమే. అయితే ఎన్ని కుట్రలు చేసినా మేయర్ పీఠం దక్కదనే భావనలో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒక్క రోజు సమావేశంతో ఉన్న పరువు కాస్తా తీసుకున్నారని పీర్జాదిగూడ ప్రాంత ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. 

Read More యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సతీష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు 

ఒక్క రోజు సమావేశంలో...
డిప్యూటీ మేయర్ అధ్యక్షత న జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ త్రిళేశ్వర్ రావు, పలువురు కార్పొరేటర్లతో కలిసి పలు అంశాలపై చర్చించినారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ఈదురుగాలులకు విద్యుత్తు అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయాలని, త్రాగునీరు రోజు విడిచి రోజు సరఫరా చేసే విధంగా అధికారులు దృష్టిసారించాలన్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న ఎస్.ఎన్.డి.పి పనులను, పీర్జాదిగూడ 4 లైన్ల రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై చర్చించారు.ప్రధానంగా కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పలువురు కార్పొరేటర్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది.

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు