మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం 

మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం 

జయభేరి, గజ్వేల్, జనవరి 28 :
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 12 వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ పదవి కాలం పూర్తయిన సందర్భంగా అత్తెల్లి శ్రీనివాస్ అభిమానులు, శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో  అభిందన సభ ఏర్పాటు చేసి అత్తెల్లి శ్రీనివాస్ దంపతులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శివ గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ 12 వ వార్డ్ కౌన్సిలర్ గా అత్తెల్లి శ్రీనివాస్ విధులు నిర్వహించి ప్రజలకు విశేష సేవలు చేశారని,ప్రజలతో మమేకమై మంచి గుర్తింపు పొందిన అత్తెల్లి శ్రీనివాస్ వార్డ్ రూపు రేఖలు మార్చారని. 

వార్డ్ ప్రజల కష్టసుఖాల్లో పాల్గొని అందరి మన్నన పొందారని రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు, అనంతరం అత్తెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నాకు కౌన్సిలర్ గా అవకాశం కల్పించిన వార్డ్ ప్రజలకు రుణపడి ఉంటానని,పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా ఉంటానని, మీ ప్రేమ అభిమానం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అభినందన సభ ఏర్పాటు చేసి మమ్మల్ని సన్మానించడం సంతోషంగా ఉందని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి