పేద విద్యార్థులకు అండగా ఎమ్మెస్ ఫౌండేషన్..

విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ చేసిన ఎమ్మెస్ ఫౌండేషన్ చైర్మన్ మహేష్ బాబు 

పేద విద్యార్థులకు అండగా ఎమ్మెస్ ఫౌండేషన్..

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 24 :
పేద విద్యార్థుల అభ్యున్నతికి కోసం తన వంతు సహకారం ఉంటుందని ఎమ్మెస్ ఫౌండేషన్ చైర్మన్ మహేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం గుంటిపల్లిలో 80 మంది విద్యార్థులకు ప్లేట్లు, స్టడీ మెటీరియల్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద విద్యార్థులకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని తెలిపారు.ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నిర్మలా దేవి, ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, రాజు, శారదా, కాంగ్రెస్ నాయకుడు కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ...