ఘనంగా దుర్గమ్మ బోనాలు

ఘనంగా దుర్గమ్మ బోనాలు

జయభేరి, మేడ్చల్ : 

మేడ్చల్ పట్టణంలోని కుమ్మరి బస్తీలో ఆదివారం ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. కుమ్మరిబస్తీలో దుర్గమ్మ ఆలయ పునప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. బస్తీకి చెందిన మహిళలు ఊరేగింపుగా బోనాలను తీసుకువచ్చి, అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత