ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల లోను అలాగే అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1నుండి 19ఏళ్ళ వయసు ఉన్న వారందరికీ నులిపురుగుల నివారణ కై ఆల్బెండజోల్ 400ఎం జి మాత్రలను పంపిణీ చేశామని రాజోలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు తెలిపారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం లో భాగంగా గురువారం రాజోలి మండలం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల లోను అలాగే అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1నుండి 19ఏళ్ళ వయసు ఉన్న వారందరికీ నులిపురుగుల నివారణ కై ఆల్బెండజోల్ 400ఎం జి మాత్రలను పంపిణీ చేశామని రాజోలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగులు రాకుండా తగిన ఆహార నియమాలను పాటిస్తే వాటిని నివారించవచ్చని ఆయన ఆన్నారు. తేనే, వెల్లుల్లి, దానిమ్మ పండ్లు, క్యారెట్ వంటి ఆహారం తీసుకుంటే కడుపులోని నులిపురుగులను తగ్గించడం లో సాయపడుతాయని చెప్పారు. పీచు పదార్థాలు బాగా ఎక్కువగా తీసుకోవాలని అన్నారు.
Post Comment