గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యo
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
జయభేరి, పరకాల అక్టోబర్ 31: పరకాల నియోజకవర్గంలో గురువారం దామర మండల కేంద్రంలోని సింగరాజుపల్లి గ్రామ ఆర్&బి రోడ్ నుండి హరిశ్చంద్రనాయక్ తండా వయా సింగరాజుపల్లి వరకు ఎస్టి ఎస్డిఎఫ్ నిధుల నుండి 3 కోట్ల 4లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?
రహదారులు బాగుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ప్రతి గ్రామానికి రహదారులు ఏర్పాటు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయముతో ఉందని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించేలా కృషి చేస్తానని, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం ల్యాదళ్ళ గ్రామ సమీపంలోని శివాలయమును ఎమ్మెల్యే సందర్శించి, శివాలయాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
Read More Auto I షౌకత్ గ్యారేజ్
Views: 1


