లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన చింతపల్లి కరెంట్ ఆర్టిజన్ గ్రేడ్-2 నండింపల్లి వేణు

చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రావి సూర్య నారాయణ గత మూడు సంవత్సరాలనుండి అగ్రికల్చర్, డోమెస్టిక్ విద్యత్ పోల్స్, బోరు కలెక్షన్ కోరకు ఇబ్బందులకు గురిచేసాడు... సదరు విద్యుత్ ఉద్యోగి యాభై వేలు డిమాండ్ చేసాడు. పనికి ముందుగా 20వేల రూపాయలు పని తరువాత 30వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు.

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన చింతపల్లి కరెంట్ ఆర్టిజన్ గ్రేడ్-2 నండింపల్లి వేణు

జయభేరి, చింతపల్లి :
చింతపల్లి మండలo మల్లారెడ్డి పల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ గ్రేడ్-2 విధులు నిర్వహిస్తున్న నడింపల్లి వేణు అనే వ్యక్తి  రావి సూర్య నారాయణ రైతు వద్ద నుండి 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రావి సూర్య నారాయణ గత మూడు సంవత్సరాలనుండి అగ్రికల్చర్, డోమెస్టిక్ విద్యత్ పోల్స్, బోరు కలెక్షన్ కోరకు ఇబ్బందులకు గురిచేసాడు...

సదరు విద్యుత్ ఉద్యోగి యాభై వేలు డిమాండ్ చేసాడు. పనికి ముందుగా 20వేల రూపాయలు పని తరువాత 30వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. దాంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి  20వేల రూపాయలు రైతు వద్ద నుండి తీసుకుంటుండగా ఏ సి బి, డిఎస్పి జగదీష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాడు.. వారి వెంట ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకట్రావు, రామారావు సిబ్బంది వున్నారు..

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి