నాచారంలో BRS పార్టీ మహా పాదయాత్ర

నాచారంలో BRS పార్టీ మహా పాదయాత్ర

జయభేరి, ఉప్పల్ :

ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో  నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ తో పాటు నాచారం డివిజన్లో BRS పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మహా పాదయాత్ర చేపట్టడం జరిగింది. 

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

పాదయాత్రలో భాగంగా నాచారం చౌరస్తా నుండి బాబా నగర్ గుండా రామ్ రెడ్డి నగర్ నాచారం ఓల్డ్ విలేజ్ అంబేద్కర్ నగర్ భవాని నగర్ సాయి నగర్ రాఘవేంద్ర నగర్ ఇందిరానగర్ శాంతి గార్డెన్స్ వరకు పాదయాత్ర నిర్వహించి ప్రజలను ఓటు అభ్యర్థించడం జరిగింది.

Read More మత్తుపదార్థాల అవగాహన కార్యక్రమం 

ఈ పాదయాత్రలో సుమారు రెండువేల మంది టిఆర్ఎస్ పార్టీ సైనికులు పాల్గొనడం జరిగింది. పాదయాత్రలో ఎటువైపు చూసిన ప్రజలు అభివాదం చేస్తూ మా ఓటు మీకే అంటూ మద్దతు తెలిపారు. 

Read More మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం 

ఎమ్మెల్యే పాదయాత్రలో నాచారం డివిజన్లోని ఏ వీధిలో వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు తప్పక కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి ఎలాగైతే హైదరాబాదులో ఎమ్మెల్యేలను గెలిపించారు అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి  రాగిడి లక్ష్మారెడ్డి ని కూడా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బారసా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి