శామీర్ పేట్ మండలంలో బీఆర్ఎస్ కు గట్టి షాక్
శామీర్ పేట్ లో ఖాళీ అవుతున్న కారు.. ఈటెల సమక్షంలో బీజేపీ లో చేరిన మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సుదర్శన్.. మాజీ సర్పంచ్ బాలామణి, మల్కాజ్ గిరి సీటు కమలానిదే - ఈటెల
జయభేరి, ఏప్రిల్ 14:
పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీల్లో జంప్ జిలానీలు మొదలయ్యాయి. తాజాగా .మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ ఎదురైంది. శామీర్ పేట్ మాజీ సర్పంచ్ బాలమణి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్, మండల నాయకులు మైసయ్య తో పాటు సుమారు 100 మందితో నేతలతో కలిసి మల్కాజ్ గిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో కమలం గూటికి చేరారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో రోజు రోజుకు బిజెపికి ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఈ సారి ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?
Views: 0


