అపూర్వం ఆత్మీయ సమ్మేళనం 

అపూర్వం ఆత్మీయ సమ్మేళనం 

జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 :
వర్గల్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2014-15 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. వర్గల్ మండలం గౌరారం లోని 7 హిల్స్ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించి, విద్య బుద్ధులు నేర్పిన గురువులను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. పాఠశాలలో చదివిన నాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. అనంతరం గ్రూప్ ఫోటోలు దిగి, సామూహిక భోజనాలు చేశారు. 10 సంవత్సరాల తర్వాత కలిసి చదివిన మిత్రులంతా ఒకచోట కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. యోగ క్షేమాలను ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు.

Read More Nagaaram Municipality I ఖల్ నాయక్.. కౌన్ ఆతా బై... అనే దేవ్ దే.. ఖేంగే...

Views: 0