చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం
జయభేరి, హైదరాబాద్ : వరద బాధితుల సహాయార్థం అగ్రనటుడు, కేంద్ర మాజీ మంత్రి 'మెగాస్టార్' చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన చిరంజీవి విరాళం చెక్కును అందజేశారు.
Views: 0


