న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు

న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు

హైదరాబాద్‌:

రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. తమకు ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంతో పోలిస్తే న్యాయవాదుల సంఖ్య పెరిగిందని, అందుకు తగినట్లుగా ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు. ఆ వినతిని పరిశీలించిన ముఖ్యమంత్రి న్యాయవాద వృత్తి పట్ల తనకు ఎంతో గౌరవముందని, న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే వారి సంక్షేమ సంఘానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు.....

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.