సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం 

సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం 

న్యూఢిల్లీ జులై 18 : సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లు బాధ్య తలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ గురువారం వారితో ప్రమాణస్వీకారం చేయించారు. 

కొత్త నియామకాలతో మూడు నెలల తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూ ర్తుల సంఖ్య 34కి చేరింది. ఏప్రిల్‌ 11న జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ వేసవి సెలవులకు కొద్ది రోజుల ముందు జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలు పదవీ విరమణ చేయడంతో రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. 

Read More Kejriwal's own arguement : కోర్టులో సొంతంగా వాదించిన కేజ్రీవాల్...

ఐదుగురు సభ్యులో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం జులై 11న జస్టిస్‌ ఎన్‌. కోటీశ్వర్‌ సింగ్‌, జస్టిస్‌ ఆర్‌. మహదే వాన్‌ల పేర్లను ప్రతిపాదించ గా.. వారం రోజులలోపే కేంద్ర ప్రభుత్వం నియామ కాలకు అనుమతినిచ్చింది. 

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

సుప్రీంకోర్టులో తొలిసారి ఈశాన్య రాష్ట్ర్రమైన మణిపూర్‌కు ప్రాతినిథ్యం దక్కిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ మొదటిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు..

Read More Himanta Biswa Sarma : అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్‌ని తానే కోరితెచ్చుకున్నారు...

Views: 0

Related Posts