మిషన్‌ ఇంపాజిబుల్‌ గా 400 పార్

భారతీయ జనతా పార్టీ చార్‌ సౌ పార్‌ నినాదం మిషన్‌ ఇంపాజిబుల్‌గా మారిపోయింది

ఈ ఎన్నికలకు ముందు భాజపా నేత అనంత్‌ హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటించారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే బీజేపీకి 400 సీట్లు కావాలంటోందని ప్రచారం చేశాయి. ఇది మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు.

మిషన్‌ ఇంపాజిబుల్‌ గా 400 పార్

భారతీయ జనతా పార్టీ చార్‌ సౌ పార్‌ నినాదం మిషన్‌ ఇంపాజిబుల్‌గా మారిపోయింది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ సాధిస్తామని ఎంతో ధీమాగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఇప్పుడు సొంతంగా మెజార్టీ సాధించడం గగనంగా మారింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంలో ఈ ఎన్నికల బరిలో దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆశించిన సీట్లు సాధించలేకపోయింది. 2019లో 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి భారీగా సీట్లు కోల్పోయింది. కనీసం గత ఎన్నికల సీట్లు కూడా సాధించలేదు. దేశంలో ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువ. 2014, 2019 ఎన్నికల్లో వీరంతా బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికలకు ముందు భాజపా నేత అనంత్‌ హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటించారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే బీజేపీకి 400 సీట్లు కావాలంటోందని ప్రచారం చేశాయి. ఇది మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు.

Read More ప్రకృతి ప్రకోపానికి బలి కాకుండా ఏమి చేయాలి...

కాంగ్రెస్ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టినా.. పార్టీ యంత్రాంగం దీనిని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో విఫలమైంది పదేళ్ల తర్వాత తొలిసారి ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కాషాయదళానికి తలెత్తింది.ఎన్నికలు షెడ్యూల్‌కు చాలా కాలం ముందే బీజేపీ చార్‌ సౌ పార్‌ నినాదాన్ని బీజేపీ అందుకుంది. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసినందుకు సొంతంగా బీజేపీకి 370 సీట్లు, NDA కూటమి 400 సీట్లు సాధిస్తుందని బీజేపీ అగ్రనేతలు పదేపదే తమ ప్రచారంలో ప్రస్తావించారు. బట్‌ అది వర్కౌట్‌ కాలేదు. ఫలితాలు చూస్తుంటే బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ మార్కు 241కు చేరుకోవడం సాధ్యం కాదనే విషయం తేటతెల్లమైంది. నిరుద్యోగం, ధరల పెరుగదల, అగ్నివీర్‌ పథకం బీజేపీకి భారంగా మారాయంటున్నారు నిపుణులు.

Read More ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

12_03_2024-caa_news_12_march_2024__1_-removebg-preview

Read More జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

సైన్యంలో అత్యధిక సంఖ్యలో యువకులు చేరే రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీకి సంఖ్యాబలం తగ్గడం అగ్నివీర్‌ ప్రభావమే అని చెప్పక తప్పదు.బీజేపీ ఆలోచనలకు అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ పెద్ద దెబ్బకొట్టింది. అయోధ్యలో రామమందిరం కట్టక ముందు యూపీలో బీజేపీ ఎంతో ఆదరణ సాధించింది. 2019 ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను 62 చోట్ల విజయం సాధించింది. కానీ ఈసారి ఆ సంఖ్య సగానికి తగ్గింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గురించి ప్రతీ సభలోనూ పదే పదే ప్రస్తావించినా యూపీ ఓటర్లు మాత్రం బీజేపీని అంతగా ఆదరించలేదు. ఇద్దరు కుర్రాళ్లు, ఇద్దరు యువరాజులంటూ రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ను ప్రతీ సభలోనూ ప్రధాని మోదీ విమర్శించడం యూపీ ఓటర్లు అంతగా ఆకట్టుకోలేదని అనుకోవాలి. ఇన్‌ఫ్యాక్ట్ ఆ మాటలు ఆ యువరాజుల వైపు ఆలోచించేలా చేశాయి.

Read More డిజిటల్ అగ్రికల్చర్ మిషన్

అత్యధిక ఎంపీ సీట్లున్న మహారాష్ట్రలోనూ బీజేపీ బలహీనపడింది. NCP, శివసేనను చీల్చడం మహారాష్ట్ర ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. మహారాష్ట్ర బీజేపీ కేవలం 12 స్థానాలకే పరిమితమైంది. ఏక్‌నాథ్‌ షిండే పార్టీ ఆరు స్థానాలు, NCPని చీల్చి తనదే ఆ పార్టీ అని ప్రకటించుకున్న అజిత్‌ పవార్‌ పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. సొంత రాష్ట్రం గుజరాత్‌ను వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌ చేయాలనుకున్న మోదీ-షా వ్యూహం ఈ ఎన్నికల్లో విఫలమైంది. పదేళ్ల తర్వాత తొలిసారి గుజరాత్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున ఒక ఎంపీ లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు.అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం గతంలో కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలు ఆయనకు పీఠం కట్టబెట్టారు. నేటి బీజేపీ నాయకత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చింది. తమకు అనుకూలంగా ఉన్నవారితో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది.

Read More కూలిన ఎయిర్‌పోర్ట్ పైకప్పు..

మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం ఏక్నాథ్ శిండే సీఎం కావడంపై నిరసన వ్యక్తమైనా పట్టించుకోలేదు. గతేడాది శరద్ పవార్ పార్టీ సైతం బీజేపీ చీల్చింది. ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది.దేశంలోని యువత ప్రత్యేకించి హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్.. తదితర రాష్ట్రాల్లో సైనికదళాల్లో చేరుతుంటారు. వారి ఆశలపై నీరుచల్లుతూ కేంద్రం అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.దేశంలో పేదలు ఎక్కువగా ఉన్నారు. అసలు తమకు ఎలాంటి పథకాలు ఉన్నాయో కూడా తెలియని అమాయకులు ఎంతో మంది. వీరికి రేషన్ అందుతోందా లేదా అన్న అంశంపై స్థానికంగా ఉండే భాజపా, మిత్రపక్షాల కార్యకర్తలు దృష్టిపెట్టాల్సి ఉంది.

Read More 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు..

వందేభారత్ తదితర సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం సామాన్యుడి ఆకాంక్షలను పట్టించుకోలేదు. మధ్యతరగతి, ఉన్నత వర్గాలు సమాజంలో తక్కువ ఉంటారు. ఎన్నికల వ్యవస్థలో పాల్గొనేది పేదలే. వారికి అనుకూలంగా సంస్కరణలు ఉండాలి.జీఎస్టీ పన్ను విధానం గందరగోళంగా ఉంది. ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా సామాన్యులు వినియోగించే పలు వస్తువులపై పన్నును తగ్గించకపోవడంతో వారిపై భారం పడింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు.ఇండియా కూటమిని బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించలేదు. అతివిశ్వాసం ప్రదర్శించింది. మోదీ అమిత్‌షా కాంగ్రెస్‌ను, రాహుల్‌గాంధీని చులకన చేస్తూ, తమ స్థాయికి తగ్గి విమర్శలు చేశారు. 2019 ఎన్నికల తరహాలోనే ఆ కూటమి పోటీలో లేకుండా పోతుందన్న మితిమీరిన విశ్వాసంతో కూటమి చేసే విమర్శలను పట్టించుకోలేప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం తథ్యంగా కనిపిస్తోంది. అయితే గతంలో ఉన్నంత అట్టహాసం, ఆర్భాటం ఉండకపోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read More భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

Social Links

Related Posts

Post Comment