తమిళనాడులో భారీ వర్షాలు.. నీట మునిగిన పలు ప్రాంతాలు..

నీట మునిగిన పలు ప్రాంతాలు.. రహదారులన్నీ జలమయ.. పొంగిపొర్లుతున్నాయి జలపాతాలు

తమిళనాడులో భారీ వర్షాలు.. నీట మునిగిన పలు ప్రాంతాలు..

జయభేరి, చెన్నయ్, మే 22:
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.. ఇక, రహదారులన్నీ జలమయం అయ్యాయి.  ఊటీలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైతో సహా 7 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Read More Notification I లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్‌ వెలువడింది

Views: 0

Related Posts