కూలిన ఎయిర్‌పోర్ట్ పైకప్పు..

ఒకరు మృతి, 8 మందికి గాయాలు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. కుప్పకూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

కూలిన ఎయిర్‌పోర్ట్ పైకప్పు..

దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. కుప్పకూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. కుప్పకూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి పంపించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Read More Chetak Express And Railways I రైలులోని అధ్వాన పరిస్థితులు.. 

తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద మరో వ్యక్తి ఉన్నాడని, అతడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే గాయపడినవారు ప్రయాణికులా లేక బయటి వ్యక్తులా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Read More Tech layoffs this week : బైజూస్, ఆపిల్, అమెజాన్ ల్లో ఉద్యోగుల తొలగింపు..

Views: 0

Related Posts