చుక్కలు చూపిస్తున్న టమాటా...

ధర ఏకంగా రూ.100

చుక్కలు చూపిస్తున్న టమాటా...

సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది.సామాన్యులకు 'టమాటా' చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 పలుకుతుండటంతో చాలా మంది టమాటాకు టాటా చెబుతున్నారు.

రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని.. ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న, మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని వాపోతున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయాలు సాగిస్తుండటంతో చాలా మంది మధ్యతరగతి వినియోగదారులు అసలు టమాటాల వైపే చూడటం లేదు.

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

98 (5)

Read More Whatsapp I వాట్సాప్ నుండి క్రేజీ అప్‌డేట్.. ఇక స్టేటస్ టైమ్ లేదు..

ప్రతిరోజూ నగరంలో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందక ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తోంది. దీంతో డిమాండ్‌ పెరిగి ధర కొండెక్కిందని వ్యాపారులు అంటున్నారు. సెప్టెంబరు వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశముందని చెబుతున్నారు.

Read More Isha Ambani : ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి...

Views: 0

Related Posts