Ramzan : ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) కోసం ఏర్పాట్లు పూర్తి
ఒకవేళ పండుగ రోజు వర్షం కురిస్తే నగరంలోని ప్రధాన మసీదులైన మక్కా మస్జీద్, జామియా మస్జీద్, అఖ్సా మస్జీద్ లలో ఉదయం 9 : 00 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని తెలిపారు.
జయభేరి, దేవరకొండ:
నగరంలో ప్రధానంగా ఈద్గాహ్ వద్ద జరగబోయే Eid - ul - Fitr ప్రత్యేక నమాజ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఈద్గాహ్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ అజీమోద్దీన్, మహ్మద్ ఇలియాస్ పటేల్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వారు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. రేపు ఉదయం 9 గంటలకు ఈద్గాహ్ వద్ద ప్రత్యేక నమాజ్ ఉంటుందన్నారు. త్రాగునీరు, వజూ నీరు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని, వృద్ధులు వికలాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈద్గాహ్ వద్ద పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో తమతమ వాహనాలను పార్క్ చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. బందోబస్తులో ఉన్న పోలీస్ వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని తెలిపారు, నమాజ్ కు వచ్చే వారు తమ వెంట జానిమాజ్ తీసుకోరావాలని ఈ సందర్భంగా కమిటీ కోరింది. అదేవిధంగా ఈద్గాహ్ వద్ద నమాజ్ అందనివారికి 9 : 30 గంటలకు నగరంలోని జామియా మస్జిద్ లో ఏర్పాట్లు చేశామన్నారు.
ఒకవేళ పండుగ రోజు వర్షం కురిస్తే నగరంలోని ప్రధాన మసీదులైన మక్కా మస్జీద్, జామియా మస్జీద్, అఖ్సా మస్జీద్ లలో ఉదయం 9 : 00 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని తెలిపారు. ప్రకటన విడుదల చేసిన వారిలో కమిటీ సభ్యులు మహ్మద్ షబ్బీర్ అహ్మద్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్, సయ్యద్ అజీజ్, మహ్మద్ షకీల్, మహ్మద్ ముజీబ్, మహ్మద్ సలీం, ఎస్ కె బురాన్, ఖాజా మొయియొద్దీన్, మహ్మద్ షబ్బీర్, ఎస్ కె మంజూర్, యండి జాఫర్, యండి ఆఫ్రోజ్, మహ్మద్ ఖైసర్, ఎస్ కె ఇల్యాస్ బాబా లతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post Comment