రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ
రాజీనామా చేసిన వాళ్లకే ఛాన్సిస్తారా..?
విజయవాడ, సెప్టెంబర్ 2 :
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడూ లేదు. గత ఏప్రిల్‌లో చివరిగా కనకమేడల రవీంద్రకుమార్ పదవి కాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు.
రాజ్యసభలో రెండు స్థానాలు ఖాళీ అయినట్లుగా ప్రకటించారు. త్వరలోనే ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉపఎన్నికల్లో రెండు చోట్ల టీడీపీ కూటమికి ఏకగ్రీవం అవుతాయి. రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణా రావు టీడీపీలో చేరుతానని ప్రకటించారు. మరో ఎంపీ బీద మస్తాన్ రావు మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆయన మొదటి నుంచి టీడీపీ నేత. 2019లో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కూడా. తర్వాత వైసీపీలో చేరడంతో రాజ్యసభ సీటు దక్కింది. ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే టీడీపీలో చేరికపై స్పష్టత ఇవ్వలేదు. రే్పల్లెకు చెందిన మోపిదేవి వెంకటరమణారావు స్థానిక రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు.
తనకు రాజ్యసభ సభ్యత్వం ఇష్టం లేదని ఆయన అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే ఆయన రాజ్యసభ పదవిని కూడా వదులుకున్నట్లే. ఈ పదవిని టీడీపీ అధినేత చంద్రబాబు మరో సీనియర్ నేతకు కేటాయించే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజు లేదా యనమల రామకృష్ణుడుకు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఈ పదవి పదవీ కాలం మరో రెండేళ్లు కూడా లేదు. ఇప్పుడు పదవి దక్కించుకునేవారే అప్పుడు కూడా కంటిన్యూటీ పొందే అవకాశం ఉంది. బీద మస్తాన్ రావు బీజేపీలో చేరితే ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉంది.
ఆయన పదవి కాలం 2028 వరకూ ఉంది. ఆ ఒప్పందంతోనే ఆయన వైసీపీకి.. రాజ్యసభకు రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఖాళీ అయిన రెండు సీట్లలో రెండూ టీడీపీ పోటీ చేస్తుందా.. ఒకటి బీజేపీకి కేటాయిస్తుందా అన్నదానిపై స్పష్టత రావాల్సి లఉంది. అందుకే ఆయన ఏ పార్టీలో చేరేది చెప్పలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా టీడీపీకి మళ్లీ రాజ్యసభలో ప్రాతినిధ్యం.. ఐదు నెలల వ్యవధిలోనే లభించబోతోంది.
Post Comment