టార్గెట్ పులివెందుల వ్యూహం...

టార్గెట్ పులివెందుల వ్యూహం...

కడప, జూలై 24 :
పులివెందులలో జగన్‌ గెలుపుకు కారణం ఇదే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అందుకే వైఎస్ కుటుంబం గెలుస్తూ వస్తుందంటున్నారు. వారి గెలుపుకు అభిమానం కారణం కాదని.. కేవలం భయపెట్టి మాత్రమే గెలుస్తూ వస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉంటే.. అందులో ఏడింటిని గెలుచుకుంది టీడీపీ. ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టే ఈ గెలుపు సాధ్యమైందన్నది చంద్రబాబు మాట. అంతేకాదు త్వరలో పులివెందుల ప్రజల్లో కూడా మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు. అంటే చంద్రబాబు కాన్సెప్ట్ ప్రకారం.. త్వరలో పులివెందుల ప్రజల్లో భయాన్ని తొలగిస్తామని చెప్పకనే చెబుతున్నారు.టు బీ ఫ్రాంక్.. జగన్‌ను ఇప్పటికే దారుణంగా ఓడించారు చంద్రబాబు. కానీ.. ఇప్పుడు ఆయన తిరిగి కోలుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Read More Ap TDP : ఇంటి వద్దకే రూ.4వేలు పింఛన్ తెచ్చి ఇస్తాం

అంతేకాదు 2019 ఎన్నికల ముందు వివేకానంద ఎపిసోడ్‌ను తనకు ఎలా అనుకూలంగా మలుచుకున్నారో మరోసారి గుర్తు చేశారు.WHO KILLED BABAYI అనే క్వశ్చన్‌కి త్వరలోనే ఆన్సర్ వస్తుందంటున్నారు చంద్రబాబు. అంటే జగన్‌కు మోరల్‌గా మరో దెబ్బ పడనుందా? అనే క్వశ్చన్ తెరపైకి వచ్చేసింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో.. ఇప్పటికే ఏపీ ప్రజల్లో దీనిపై చర్చ మొదలైంది. ఈ కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉందని సీబీఐ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అరెస్ట్‌ చేసేందుకు కూడా రెడీ అయ్యింది.

Read More RAGHURAMARAJU I రఘురామరాజుకు నిరాశే!

కానీ ఆయన కోర్టును ఆశ్రయించి చెరసాలకు చేరకుండా బయటే ఉండిపోయారు. కానీ.. ఇంకెంత కాలమో అది కొనసాగదని చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది.ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే.. పార్టీ పరంగా వైసీపీకి.. వ్యక్తిగతంగా జగన్‌కు అది పెద్ద దెబ్బే. ఎందుకంటే అవినాష్‌ రెడ్డిని మొదటి నుంచి వెనకేసుకువస్తున్నారు జగన్. అవినాష్‌ కోసం సొంత చెల్లెని, బాబాయ్‌ కూతురిని కూడా వదులుకున్నారు. అందుకే ఈ కేసులో అవినాషే నేరస్థుడని తెలితే అది జగన్‌కు పెద్ద దెబ్బ.. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేరుగా జగన్‌ కుంభస్థలంపై కొట్టేందుకు ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది.మీకు గుర్తుండి ఉండే ఉంటుంది. ఎన్నికలకు ముందు కుప్పంలో చంద్రబాబును మట్టి కరిపించేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్‌ చేశారు.

Read More Mathar therisa I మానవత్వనికి మారుపేరు మదర్ థెరిస్సా: వేగేశన నరేంద్ర వర్మ

కుప్పంలో చాలా మంది వైసీపీలో చేరేలా చేశారు. కానీ తీరా ఎలక్షన్స్ వచ్చే సమయానికి పరిస్థితి మొత్తం తలకిందులైంది. కుప్పంలో చంద్రబాబు గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోయారు. మరి ఈ విషయాలను గుర్తు పెట్టుకున్నారనుకుంటా చంద్రబాబు. ఇప్పుడు ఏకంగా పులివెందులపైనే ఫోకస్ చేశారు.ఎలాగైతే బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారో.. అదే కాన్సెప్ట్‌ని కుప్పం, మంగళగిరితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్‌ చేయాలని ప్రయత్నించారన్నది చంద్రబాబు ఆరోపణ. ప్రజల్లో మార్పు తీసుకొచ్చాం. ఇప్పుడు పులివెందుల ప్రజల్లో కూడా మార్పు తీసుకోస్తామంటున్నారు. చంద్రబాబు మాటలను జగన్‌ సీరియస్‌గా తీసుకుంటే.. రాష్ట్రంతో పాటు.. సొంత నియోజకవర్గానికి కూడా జగన్ టైమ్‌ కేటాయించాల్సి ఉంటుంది. లోకల్‌గా పర్యటించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే జగన్‌ను పులివెందులకే పరిమితం చేసే ఎత్తుగడనా? అనే అనుమానం కూడా లేకపోలేదు. ఏదేమైనా చంద్రబాబు తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారో చూడాలి.

Read More జగన్‌పై దాడి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఈసీ ఆదేశం

Views: 0

Related Posts