డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఏపీ సచివాలయానికి పవన్..
డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారి జూన్ 18న ఏపీ రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన చాంబర్ పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
జయభేరి, విజయవాడ, జూన్ 18 :
ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఆ తరువాత సచివాలంలోని తన ఛాంబర్ ను పరిశీలించారు.
ఎన్నికల ఫలితాలు విడుదలై డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారి జూన్ 18న ఏపీ రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన చాంబర్ పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. 2017 తర్వాత పవన్ సచివాలయానికి రెండవసారి వెళ్లనున్నారు. నాడు ఉద్దానం సమస్యలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లిన పవన్.. రాష్ట్ర సచివాలయంలోని బ్లాక్-2లో తనకు కేటాయించిన ఛాంబర్‌ని పవన్ పరిశీలించారు.
పవన్ కల్యాణ్ సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌ను పరిశీలించారు. అంతకు ముందు విజయవాడలో తన క్యాంపు కార్యాలయన్ని పరిశీలించారు. తన కార్యాలయంలోనే ఆయన మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అంతకు ముందు పవన్ కల్యాణ్ ర్యాలీగా సచివాలయానికి వచ్చారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి రావడంతో అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పలు చోట్ల గ్రామస్తులు ఆయనపై పూలవర్షం కురిపించారు.
పవన్ కల్యాణ్ వెంట జనసేన పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. వారు ఇప్పటికే తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను తీసుకున్నారు. పవన్ చంద్రబాబు మధ్య రాష్ట్రంలో రాజకీయంగా, పాలనా పరంగా ఎదురు కానున్న సవాళ్ల గురించి చర్చ జరిగినట్లుగా తెలస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ సందర్శన.. అక్కడి పరిస్థితుల్ని చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు వివరించారు. పోలవరం పూర్తి చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా చర్చించు. అసెంబ్లలో ప్రతీ విభాగానికి సంబంధించిన శ్వేతపత్రం ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయించారు.
అప్పుల విషయంలో ఒక్క చిన్న తప్పు లేకుండా మొత్తం ప్రజల ముందు పెట్టాలని అనుకుంటున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతకంటే ముందు పవన్ కల్యాణ్‌కు Y ప్లేస్ కేటగిరి, ఎస్కార్ట్ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అలాగే బులెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించింది. మొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్ కల్యాణ్‌కు భారీ మానవహారంతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతి రైతులు.
మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌కు భద్రత పెంచింది ప్రభుత్వం. Y ప్లస్ సెక్యూరిటీతో పాటు.. బులెట్ ప్రూఫ్ కార్‌ను పవన్‌కు కేటాయించింది ప్రభుత్వం. బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు పవన్. కాసేపట్లో గన్నవరం చేరుకోనున్న పవన్ కల్యాణ్ విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిశీలించనున్నారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ పవన్‌కు కేటాయించారు. తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి సచివాలయానికి చేరుకుని రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు.డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్‌కు Y ప్లేస్ కేటగిరి, ఎసకర్ట్ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అలాగే బులెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించనుంది. ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేసుకోనున్న పవన్..10.30 గంటల మధ్య విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు.


