మద్యం ధరలపై ఏపీలో చట్ట సవరణ..

విదేశీ బాటిళ్ల ఎమ్మార్పీపై అదనపు ప్రివిలేజ్‌ ఫీజు

మద్యం ధరలపై ఏపీలో చట్ట సవరణ..

జయభేరి, అమరావతి: భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఈమేరకు అదనపు ప్రివిలేజ్‌ ఫీజు విధిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అదనపు ప్రివిలేజ్‌ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. దీంతో ఎమ్మార్పీ ధర రూ.150.50గా ఉంటే రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్‌ ఫీజు ఉండనుంది. రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Read More AP Govt.. Geethanjali Family I గీతాంజలి కుటుంబానికి అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం... రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటన!

Views: 0

Related Posts