పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న శివ భక్తులు, గ్రామ ప్రజలు

పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం

జయభేరి, పరవాడ :
పరవాడ గ్రామంలో కార్తీక మాసం మూడోవ సోమవారం సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గ్రామంలో భక్తులు, దాతలు సహాయ సహాకారంతో ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమంను గ్రామంలో పెద్దలు చేతుల మీదుగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పరమేశ్వరుడి ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలు అందరిపై ఉండి వారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంకి చుట్టూ ప్రక్కల గ్రామాలు నుంచి శివ భక్తులు పాల్గోని తీర్ధ ప్రసాదాలు స్వికరించారు.ఈ యొక్క కార్యక్రమంలో మండల ఎంపీపీ వెంకట పద్మలక్ష్మీ శ్రీనివాసురావు,పరవాడ సర్పంచ్ ఎస్ అప్పల నాయుడు,పరవాడ మాజీ సర్పంచ్ చుక్క రాము నాయుడు,మాజీ జడ్పీటీసీ పైల జగన్నాధ రావు,నాయుకులు పంచకర్ల ప్రసాద్,కన్నూరు వెంకటరమణ, పైల రామ చంద్రరావు, బుగిడి రామ గోవింద రావు, భక్తులు, స్వామిలు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Read More TDP BJP I టిడిపి.. బిజెపి.. జనసేన పొత్తు..? గెలుపు దక్కేన!?

Views: 0

Related Posts